- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధర్మం... ధైర్యం... సేవ.. ఇదే నా మార్గం: పవన్ కల్యాణ్
ధర్మం...ధైర్యం...సేవ మార్గంలో నడుస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: ధర్మం...ధైర్యం...సేవ మార్గంలో నడుస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అన్నారు. అంతేకాదు తాను ఎప్పుడూ ఇలానే నడుచుకుంటానని ఆయన చెప్పారు. పల్నాడు జిల్లా కోటప్పకొండ(Kotappakonda)లో త్రికోటేశ్వరస్వామి(Trikoteswara Swamy)ని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ధర్మం, ధైర్యం, సేవే తన మార్గమని చెప్పారు. కోటప్పకొండ పర్యటన తన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అంతకుముందు...
అంతకుముందు పవన్ కల్యాణ్ కారు ఫుట్ రెస్ట్‌పై నిలబడి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం కోటప్ప కొండపైకి ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు జమిందార్ రామకృష్ణ కొండలరావు, ఈఓ చంద్రశేఖర్ వేదపండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆ తరువాత పవన్ కల్యాణ్ స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆతర్వాత ఆలయంలోకి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయనకు పూజారులు ఆశీర్వదించారు. పూజ అనంతరం పవన్ కల్యాణ్ కోటప్ప కొండ నుంచి కొత్తపాలెంకు నిర్మించిన కొత్త రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు.
READ MORE ....






