- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan : ఏ సమస్య ఉన్నా నాకు చెప్పొచ్చు: గిరిజనులకు పవన్ కల్యాణ్ భరోసా
ఏ సమస్య ఉన్నా తనతో పంచుకోవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో పర్యటించిన ఆయన గిరిజనులతో మాటామంతి నిర్వహించారు. ..

దిశ, వెబ్ డెస్క్: ఏ సమస్య ఉన్నా తనతో పంచుకోవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అన్నారు. అల్లూరి జిల్లా నందిగరువు(Nandigaruvu)లో పర్యటించిన ఆయన గిరిజనుల(Tribal)తో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న పవన్ కల్యాణ్.. ప్రజల కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. సరైన రహదారి లేక నందగరువు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, గత ప్రభుత్వం పట్టించుకోలేదని, తాను మాత్రం తట్టుకోలేకపోయానని చెప్పారు. గిరిజనులు కష్టాలు చూసి రహదారి నిర్మాణానికి తాను ముందుకొచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు.
అంతకుముందు ఓనూరు(Onuru) గ్రామంలో పవన్ కల్యాణ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నీటి కొళాయిని పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించారు. అలాగే స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన అక్కడ ఉన్న చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.






