- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధర్మేంద్ర ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్
ప్రముఖ నటులు ధర్మేంద్ర కన్నుమూశారని తెలిసి చింతించానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ నటులు ధర్మేంద్ర కన్నుమూశారని తెలిసి చింతించానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని ఆయన తెలిపారు. హిందీ చిత్ర పరిశ్రమలో తొలి తరం యాక్షన్ హీరోగా సినీ ప్రియులను ఆకట్టుకున్నారని తెలిపారు. అందుకే ఆయన్ని యాక్షన్ కింగ్, హీమ్యాన్ అని అభిమానంగా పిలుచుకునేవారని గుర్తు చేశారు. షోలే, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, సీతా ఔర్ గీత, యాదోం కి బారాత్ లాంటి చిత్రాలతో నటనలో తనదైన శైలి చూపించారన్నారు. 2004 నుంచి అయిదేళ్లపాటు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో ఉన్నారని, ధర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్, బాబి డియోల్, సతీమణి హేమమాలినికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Next Story






