- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ద ప్రాబ్లం సాల్వ్.. పోలీసులకు పవన్ కల్యాణ్ అభినందనలు
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు...

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల(Pulivenduala), ఒంటిమిట్ట(Ontimitta)మండలాల జడ్పీటీసీ(Zptc) ఉప ఎన్నికల్లో– కూటమి బలపరచిన తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయం కచ్చితంగా ఆయా మండలాల ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అంతేకాదు ఆయా మండలాల్లో విజయం సాధించిన శ్రీమతి లతారెడ్డి, ముద్దుకృష్ణా రెడ్డిలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదని గుర్తు చేశారు. నామినేషన్ వేద్దామనుకొన్నవారిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. ఏకగ్రీవాలకు వెసులుబాటు ఉందని, కానీ ఏకపక్షంగా సాగినప్పుడు ప్రజాస్వామ్యబద్ధమైన తీర్పు రాకపోవచ్చన్నారు. పులివెందులలో పోటీ ఉండటం వల్లే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తమ తీర్పు వెల్లడించారని తెలిపారు. ఇప్పటి వరకూ ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేసుకొంటూ వచ్చారని, ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో పోటీకి ఆస్కారం కలిగిందన్నారు. మూడు దశాబ్దాల తరవాత స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు నచ్చినవారికి ఓటు వేసుకోగలిగామని పులివెందుల ఓటర్లు చెప్పారు అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో రాష్ట్రమంతా అర్థం చేసుకొంటోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
‘‘పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నియమావళి ప్రకారం నామినేషన్ల ప్రక్రియ సాగింది. అభ్యర్థులు ప్రచారాలు చేసుకొన్నారు. పోలింగ్ సాగింది. ఎన్నికల నిర్వహణ మూలంగా ప్రజా తీర్పు స్పష్టంగా వెలువడింది. ఈ ప్రక్రియ ఇష్టం లేని పార్టీ ప్రతి దశలో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికలు సాగటం నచ్చక, అసహనంతో ప్రభుత్వంపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. పోలింగ్ సందర్భంలో హింసకు తావు లేకుండా చర్యలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు అభినందనలు తెలియచేస్తున్నాను.’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.






