- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవనిగడ్డ అభివృద్ధిపై సమీక్ష.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
కృష్ణానదిపై హైలెవల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలను అనుసంధానం చేసేలా వంతెన నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి, మొంథా తుపాను నష్టంపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. బుధవారం అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరగనున్న అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించాలని ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక కృష్ణానదిపై హైలెవల్ వంతెనతో దీవుల్లోని గ్రామాలను అనుసంధానం చేసేలా వంతెన నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సాస్కీ పథకం నిధుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నామని, కేంద్ర ప్రభుత్వ సాయంతో అవనిగడ్డ పరిధిలో అవుట్ ఫాల్ స్లూయిజ్‌ల పునరుద్ధరణ చేసినట్లు వివరించారు. ఇప్పటికే నిలిచిపోయిన అభివృద్ధి పనులకు అటవీశాఖ అనుమతులతో మోక్షం లభించనుందన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో పనులు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఇటీవల సంభవించిన మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన కౌలు రైతుల వివరాలతో వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.






