- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఆమె సూర్యుడిని కబళించింది' పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన 'ఆమె సూర్యుడిని కబళించింది' పుస్తకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐక్యరాజ్య సమితి పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన 'ఆమె సూర్యుడిని కబళించింది' పుస్తకాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పవన్, సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని సూచించారు.
ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలని పవన్ పేర్కొన్నారు. తన ఆలోచనను ఇతరులతో పంచుకుంటానని పవన్ తెలిపారు. పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయన్నారు. ఒక పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటామని, సాధించదలుచుకుంటే పట్టుదల అవసరం అని తెలిపారు. ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకంలో మాలతి క్యారెక్టర్ ను చదివానని, పుస్తకం ఎంతో స్ఫూర్తినిచ్చిందని కితాబిచ్చారు. ఆ పాత్రలో ధైర్య సాహసాలు మేధస్సు, భారతీయ స్వాతంత్రం ఆనాటి సంస్కృతి సంప్రదాయం పుస్తకంలో కనిపిస్తాయన్నారు. మా అమ్మ వంట గది నుంచి ప్రపంచాన్ని చూసిందని గుర్తు చేసుకున్న పవన్.. రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్లు త్వరలో అమలు కాబోతున్నాయని తెలిపారు. భారతీయ ఆలోచన విధానం నుంచి తాను వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. మనదేశంలో స్త్రీకి అత్యున్నత విలువలు ఉన్నాయని తెలిపారు. జనసేన మహిళ విభాగానికి ఝాన్సీ వీర మహిళ పేరు పెట్టామని అన్నారు. మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. నేను మంత్రి కాకపోయి ఉంటే మీ మధ్యలో కూర్చుని పవర్ స్టార్, ఓజీ అని అరిచేవాడిని , నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు.






