- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూ వివాదాల్లో రాజకీయ నేతల జోక్యం.. పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
భూ వివాదాల్లో రాజకీయ నేతల జోక్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: భూ వివాదాల్లో రాజకీయ నేతల జోక్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)కు కంప్లైంట్ చేశారు. ఉత్తరాంధ్ర(Uttarandra) వేగంగా అభివృద్ధి చెందుతోందని, దీంతో భూముల(Lands) విలువలు పెరుగుతుండటంతో నేతలు సెటిల్‌మెంట్లకు దిగుతున్నారని, తనకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ కల్యాణ్ తెలిపారు. శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భూ కబ్జాలపై నిందితులను వదిలిపెట్టొద్దని చెప్పారు. భూ వివాదాల్లో నాయకుల జోక్యాన్ని సహించొద్దని సూచించారు. నాయకుల జోక్యంతో అటు అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఇకపై ఏ నాయకుడిపైనా ఆరోపణలు రావడానికి వీల్లేదని సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ తెలిపారు.
దీంతో కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతల విషయంలో అసలు వెనక్కి తగ్గొద్దని సూచించారు. భూవివాదాల్లో ఎవరి జోక్యం ఉన్న వదిలిపెట్టొద్దని ఆదేశించారు.






