పని తీరులో వెనుకబడ్డ పవన్ కల్యాణ్ శాఖ.. సంక్షేమంలో 'బిసి' టాప్!

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-07 09:51:50  IST  )

ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖల పని తీరును కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ప్రాతిపదికన విశ్లేషించి, వాటికి A, B, C, D గ్రేడులతో ర్యాంకులను కేటాయించారు....

పని తీరులో వెనుకబడ్డ పవన్ కల్యాణ్ శాఖ.. సంక్షేమంలో బిసి టాప్!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫెరెన్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖల పని తీరును కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) ప్రాతిపదికన విశ్లేషించి, వాటికి A, B, C, D గ్రేడులతో ర్యాంకులను కేటాయించారు. ఈ నివేదికలో మొత్తం 18 శాఖలు 90 శాతానికిపైగా పాయింట్లు సాధించి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాయి. ముఖ్యంగా బిసి సంక్షేమ శాఖ 100కు 100 పాయింట్లు సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అందరి ప్రశంసలు అందుకుంది.

పవన్ కళ్యాణ్ శాఖకు చిట్ట చివరి ర్యాంక్

అయితే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్న అటవీ, పర్యావరణ శాఖ ఈ జాబితాలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కేవలం 67 పాయింట్లతో ఈ శాఖ చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తీర్ణం వంటి కీలక అంశాల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ ర్యాంకుల వర్గీకరణ ద్వారా రానున్న రోజుల్లో వెనుకబడిన శాఖల్లో పాలనాపరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.

Next Story