గుజరాత్ మాజీ CM విజయ్ రూపానీ మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-13 06:32:00  IST  )

గుజరాత్ మాజీ CM విజయ్ రూపానీ మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు....

గుజరాత్ మాజీ CM విజయ్ రూపానీ మృతి పట్ల పవన్ కల్యాణ్ సంతాపం
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్(Amedabad)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం(Flight Accident)లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Former Gujarat CM Vijay Rupani) మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) సంతాపం ప్రకటించారు.

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా(Air India) విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు ఇతర ప్రయాణీకులు మరణించడం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. ప్రజా సేవకు నిజమైన నిబద్ధత విజయ్ రూపానీ అని కొనియాడారు. ఆయన మృతికి తాను హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ విషాదకరమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు, బీజేపీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

Next Story