- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విద్యా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ 3.0ను (PTM 3.0) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : విద్యా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ 3.0ను (PTM 3.0) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ మీటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. చిలకలూరిపేటలోని శ్రీ శారద జిల్లా పరిషత్ పాఠశాలలో జరగనున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి డిప్యటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఉప ముఖ్యమంత్రికి గౌరవ వందనాన్ని చేయగా దాన్ని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి పాఠశాలలోకి నడుచుకుంటూ వెళ్లారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థుల ప్రతిభ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు పడుతున్న తపనను అభినందించారు. విద్యార్థులు కూడా చదువులో ఆసక్తిని పెంచుకోవాలని, నూతన ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సరదాగా మాట్లాడారు. విద్యార్థులతో కలిసి ఫోటో దిగి వారి ఆనందంలో భాగస్వాములయ్యారు. డిప్యూటీ సీఎం వెంట చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఉన్నారు.






