మేమిద్దం ఒకేలా ఆలోచిస్తాం: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-01 12:15:09  IST  )

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను ఒకేలా ఆలోచిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు..

మేమిద్దం ఒకేలా ఆలోచిస్తాం: సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను ఒకేలా ఆలోచిస్తామని సీఎం చంద్రబాబు(Deputy CM Pawan Kalyan) అన్నారు. ఏలూరు జిల్లా(Eluru District)లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తన మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పినట్లు రాబోయే 15 ఏళ్లు కూడా కూటమి అధికారంలో ఉండాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలని ప్రజలను కోరితే అంతా కలిసి అనూహ్యమైన మద్ధతు ఇచ్చారని తెలిపారు. 164 సీట్లలో కూటమి అభ్యర్ధులను గెలిపించి తమ బాధ్యతను పెంచారన్నారు.

‘‘సూపర్ సిక్స్ ను కొందరు ఎగతాళి చేశారు. కానీ ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపాం. 18 నెలల్లో ఒక్క పెన్షన్ల కోసమే రూ. 50,763 కోట్లను ఖర్చు పెట్టాం. దేశంలో ఎవరూ ఈ స్థాయిలో సంక్షేమం ఇవ్వడం లేదు. పొరుగు రాష్ట్రాలు తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ, గుజరాత్ ఈ స్థాయిలో సంక్షేమం చేయటం లేదు. ఏడాదికి రూ.33 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. 1.65 లక్షల కోట్ల మేర వ్యయం చేస్తున్నాం. ప్రతీ నెలా 63 లక్షల పైచిలుకు మందికి వివిధ కేటగిరీల్లో పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్లలో 59 శాతం మహిళలకే ఇస్తున్నాం. అసలు పెన్షన్లు ప్రారంభించిందే ఎన్టీఆర్. దానిని పెంచింది కూడా మా ప్రభుత్వమే.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Next Story