- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూటమి నేతల తీరుపై డిప్యూటీ సీఎం సీరియస్.. సీఎంకు కీలక విజ్ఞప్తి
కూటమి నేతల తీరుపై డిప్యూటీ సీఎం సీరియస్ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: కూటమి నేతల తీరుపై రాష్ట్రంలో పలుచోట్ల విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తీరు మార్చుకోవాలని వారికి సీఎం చంద్రబాబు(Cm Chandrababu) సైతం పలుమార్లు సూచించారు. అయినా తీరు మారకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లాలనని, ప్రభుత్వ సేవలు అందించాల్సిందేనని హెచ్చరించారు.
అయితే ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) అమరావతి(Amaravagti)లో జరిగిన కేబినెబ్ భేటీలో ప్రస్తావించారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా ఇంచార్జి మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని చంద్రబాబుకు ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ సూచనపై స్పందించిన చంద్రబాబు .. ఇక నుంచి ఇంచార్జి మంత్రులు ఆ బాధ్యతలను తీసుకోవాలని ఆదేశించారు. కూటమి ఎమ్మెల్యేలు ఎవరు తప్పు చేసినా ఇంచార్జి మంత్రులు సరిదిద్దాలని కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






