- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మొంథా తుపాను(Montha Cyclone) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్న రైతులను ఆదుకునే దిశగా ఆయన అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కోడూరు ప్రాంతంలో తుపాను ధాటికి నాశనం అయిన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తుఫాన్ దెబ్బతో పంటలు పూర్తిగా మట్టికరిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మార్గమధ్యలో సాధారణ ప్రజలతో మమేకమయ్యారు. పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అర్జీలు అందజేశారు.
బాధితుల మనోభావాలను సమీక్షించిన పవన్, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, అన్ని విధాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతుల పంట నష్టాలపై అధికారులను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే మొంథా తుఫాన్ ప్రభావంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేల ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు అంచనా. కేవలం కృష్ణా జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయింది. అరటి, బొప్పాయి గాలివానతో నేలమట్టమయ్యాయి. తుఫాన్ తాకిడితో చెరువుల్లా మారిన పొలాల దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తగిన పరిహారం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా.. ఇతర మంత్రులు ఈ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
అధికారులతో కలిసి పంటలను పరిశీలించిన తర్వాత డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్తతో తుపాను వల్ల జరిగే నష్టం అధికంగా జరగకుండా చూశామని అన్నారు. భారీ వర్షాల కారణంగా 46 వేల హెక్టార్లలో పంట నష్టం వచ్చిందని, దీంతో 56 వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని, వీరిలో అత్యధికంగా కౌలురైతులే ఉన్నారని, వారందరిని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబుతో రివ్యూ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అలాగే తుపాను ప్రభావం అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందని.. దీని ప్రభావంతో అంటురోగాలు వచ్చే అవకాశం ఉండటంతో.. ఇప్పటికే వేలాది మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రతి అధికారి నిబద్ధతతో పని చేశారని గుర్తు చేశారు.
అలాగే తుపాను ప్రభావం పడిన కార్మకులు, మత్స్యకారులకు నిత్యావసరాలు అందజేస్తున్నామని, ప్రస్తుతం శిబిరాల్లో ఉన్న వారు.. ఇంటికి వెళ్లే సమయంలో రూ. 3 వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం తాము పంట నష్టంపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తున్నామని అధికారుల నుంచి వచ్చిన డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విలైనంత స్థాయిలో నష్టపరిహారం తీసుకొచ్చేందుకు సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ చెప్పుకొచ్చారు. అలాగే తుపాను సమయంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, వైద్య సిబ్బందికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రస్తుతం గ్రామ స్థాయిలో పారిశుధ్యంపై మెరుపు వేగంతో పనులు చేస్తున్నారని, తాను ఎక్కవసేపు ప్రజల్లో ఉంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అందుకే త్వరగా తన పరిశీలనను ముగిస్తున్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
READ MORE .....






