- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: దూసుకొస్తున్న వాయుగుండం.. 8 జిల్లాలకు అతిభారీ వర్షాలు
ప్రస్తుతం వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. మరికొద్ది గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య శనివారం ఉదయం తీరందాటే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో రానున్న 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూల్, నంద్యాల, అనంతపురం, కడప, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 -50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులుు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించింది.






