- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ లిక్కర్‌స్కామ్ కేసులో మరో సంచలనం.. సిట్ చేతికి కీలక వీడియో
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చేతికి కీలక ఆధారం లభించింది. గతవారంలో హైదరాబాద్ శంషాబాద్ (Shamshabad) పరిధిలో ఉన్న ఫాంహౌస్ లో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు.. తాజాగా మరిన్ని కీలక ఆధారాలను గుర్తించారు. చెవిరెడ్డి (Chevireddy) అనుచరుడైన ఏ 34 వెంకటేశ్ నాయుడు ఫోన్ లో.. డబ్బుల్ని డెన్ లో దాచి ఉంచిన వీడియో దొరికింది. ఆ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బును లెక్కపెడుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఎన్నికలకు ముందు నగదును పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన నోట్ల కట్టల్ని అట్టపెట్టెల్లో పేర్చేందుకు వీలుగా ఉంచారు. ఈ వీడియోతో చెవిరెడ్డి ముఠా లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా బుక్కైనట్లయింది. కాగా.. మద్యం వ్యాపారంతో తనకు సంబంధం లేదని చెవిరెడ్డి ఇప్పటి వరకూ చెబుతూ వస్తుండగా.. విచారణ సమయంలో సిట్ ఆ వీడియోను వెంకటేష్ నాయుడి వాట్సాప్ నుంచి రిట్రీవ్ చేసింది.






