- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
19 వరకు ఏపీ భవన్ ఆలయంపై చర్యలొద్దు: ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఈనెల 19 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులకు హైకోర్టు ఆదేశించింది...

దిశ, వెబ్ డెస్క్: ఈనెల 19 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఢిల్లీ ఏపీ భవన్(Delhi AP Bhavan) అధికారులకు హైకోర్టు(High Court) ఆదేశాలు జారీ చేసింది. ఏపీ భవన్‌లో ఆక్రమణలను అధికారులు బుధవారం కూల్చివేసేందుకు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా బాలాజీ ఆలయాన్ని(Balaji Temple) సైతం కూల్చివేసేందుకు యత్నించారు. దీంతో పూజారి గోపాల్ కుమార్( Priest Gopal Kumar) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆలయం కూల్చివేతపై పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఆలయం కూల్చివేతపై స్టే విధించింది. ఈ 19వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అంతేకాదు బాలాజీ టెంపుల్‌కు విద్యుత్, నీటి సరఫరా కొనసాగించాలని.. ఏపీ భవన్ అధికారులకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
అయితే ఈ ఆలయాన్ని 1970లో నిర్మించామని, అప్పటి నుంచి కూడా పూజలు చేస్తున్నామని, సనాధర్మాన్ని హిందువులందరూ కాపాడాలని పూజారి గోపాల్ కుమార్ కోరారు.






