"నా కోరిక తీర్చు.." మహిళా లెక్చరర్ల లైంగిక, మానసిక వేధింపులకు విద్యార్థి బలి

by Naga Rani Yarlagadda |

విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని మరణానికి గల కారణం.. మహిళా లెక్చరర్ల లైంగిక, మానసిక వేధింపులేనని తెలుస్తోంది.

నా కోరిక తీర్చు.. మహిళా లెక్చరర్ల లైంగిక, మానసిక వేధింపులకు విద్యార్థి బలి
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అతని మరణానికి గల కారణం.. మహిళా లెక్చరర్ల లైంగిక, మానసిక వేధింపులేనని తెలుస్తోంది. మృతుడు సాయితేజ ఎంవీపీ కాలనీలో ఉన్న సమత కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఏమైందో ఏమోగానీ.. శుక్రవారం ఉదయానికి ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. సూసైడ్ లెటర్ ఏమన్నా రాశాడా అని అతని గదిలో తనిఖీ చేస్తున్నారు. సాయితేజ మొబైల్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని అందులోని కాల్స్, మేసేజులను పరిశీలిస్తున్నారు. వాట్సాప్ లో ఇద్దరు లెక్చరర్లతో చేసిన మెసేజులు అనుమానాస్పదంగా ఉన్నట్లు సమాచారం. నోట్స్ రాసే విషయంలో ఒక లెక్చరర్ సాయితేజ పట్ల సీరియస్ గా ఉండగా.. మరో లెక్చరర్ తన విషయం ఏం ఆలోచించావంటూ మెసేజులు చేయడం చర్చనీయాంశంగా మారింది.

తమ స్నేహితుడి మరణానికి కారణం.. కాలేజీలో ఉన్న మహిళా లెక్చరర్లేనని స్నేహితులు చెప్తున్నారు. ఒక మహిళా లెక్చరర్ తన కోరిక తీర్చాలని అతడిని లైంగికంగా, మరో లెక్చరర్ మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. సదరు లెక్చరర్ పై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా.. సమతా కాలేజీలో మహిళా లెక్చరర్ బాగోతం బయటపడటంతో.. స్థానికంగా ఇది హాట్ టాపిక్ గా మారింది.

Next Story