- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నూల్ బస్సు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
కర్నూల్ జిల్లా చిన్న టేకూరు విలేజ్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది.

దిశ, వెబ్డెస్క్: కర్నూల్ జిల్లా చిన్న టేకూరు విలేజ్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ఉదయం 11 మంది ప్రయాణికులు మరణించినట్లు అధికారులు గుర్తించగా.. ఈ సంఖ్య మరింత పెరిగింది. తాజాగా ఫోరెన్సిక్ బృందం.. 19 మంది ప్రయాణికులు మరణించినట్లు వెల్లడించింది. మృతదేహాలకు స్పాట్లోనే పోస్టుమార్టం చేసి.. బస్సు నుంచి వెలికి తీస్తున్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం అందరినీ కలచివేస్తోంది. ప్రమాదానికి ముందు బస్సు ఒక బైకర్ ను ఢీ కొనగా.. అతను కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చేరిన ప్రయాణికుల్లో ఏడుగురు డిశ్చార్జ్ అవ్వగా.. మరో నలుగురికి ఆస్పత్రిలోనే చికిత్స కొనసాగుతోంది.
కాగా.. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయిందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బస్సు ప్రమాదంలో 20 మంది మరణించడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడ రిజిస్ట్రర్ అయిన బస్సు హైదరాబాద్ లో తిరుగుతోందని, బస్సులపై తనిఖీలు చేస్తే వేధింపులంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇకపై ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Read More: బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నాం: మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
మృత్యు రహదారిగా నెషల్ హైవే 44..! సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్






