- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. 2027 జూలై నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను ప్రకటించింది. కాగా తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రూ.271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. 2027 జూలై నుండి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను ప్రకటించింది. కాగా తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు రూ.271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుతపుతామని ఇప్పటికే ప్రకటించింది.
మరోవైపు కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వం సైతం పుష్కరాల కోసం ఏర్పాట్లను మొదలు పెట్టింది. రాష్ట్రప్రభుత్వం కమిటీల ఏర్పాటుతో పాటు నిధులను విడుదల చేసింది. కుంభమేళా తరహాలో ఘాట్లు మరియు వసతి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నదిలో అందరూ ఒకేదగ్గర స్నానాలు చేయాలి అనేలా కాకుండా ఎక్కడైనా స్నానాలు చేసేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 17 ఘాట్లు ఉండగా 75,11,616 మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.






