కనీసం ఆ విషయమైనా జగన్‌కు తెలుసా?.. MP దగ్గుబాటి పురందేశ్వరి సెటైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-10 06:51:48  IST  )

వైసీపీ(YCP) అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)పై ఏపీ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) తీవ్ర విమర్శలు చేశారు.

కనీసం ఆ విషయమైనా జగన్‌కు తెలుసా?.. MP దగ్గుబాటి పురందేశ్వరి సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ(YCP) అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)పై ఏపీ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ నాయకుల చొరవతోనో.. ఏదో ఒక వ్యవస్థ చొరవతోనో పోలీసులు అవ్వరని.. ఎంతో కష్ట తరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు అయితేనే ఆ అర్హత వస్తుందని అన్నారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను వారి భుజాన వేసుకునేటువంటి నాలుగోవ సింహంగా పోలీస్ వ్యవస్థని ప్రతి ఒక్కరూ గుర్తిస్తుంటారు. వారి ప్రాణాలను పెట్టి శాంతి భద్రతలని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తారు.

అలాంటి నాలుగో సింహంగా పరిగిణించబడిన పోలీస్ వ్యవస్థ(Police System)ను ఉద్దేశించి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి జిల్లా ఎస్పీ(Sathya Sai District SP) ఒక మహిళ అని కూడా లేకుండా విచక్షణ కోల్పోయి జగన్ మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. అసలు రాష్ట్రంలో ఐదు వేల మంది మహిళా పోలీసులు ఉన్నారనే విషయం జగన్‌కి తెలుసా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఆ మహిళలనే కాదు ఆ వ్యవస్థలో పని చేసే ప్రతి ఒక్కరినీ కించపరిచాయని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆ వ్యవస్థకి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని అన్నారు.

Next Story