- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jr. NTRకు నేనంటే చాలా ఇష్టం.. పురందీశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో నందమూరి తారక రామారావు(Jr. NTR)పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి(Daggubati Purandeswari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో నందమూరి తారక రామారావు(Jr. NTR)పై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందీశ్వరి(Daggubati Purandeswari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆమె మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘అత్తగా నన్ను చాలా గౌరవిస్తాడు. నేనంటే ఇష్టం కూడా. పిల్లలంతా రోజూ టచ్‌లో ఉంటారు. రెగ్యులర్‌గా కాల్స్, వీడియో కాల్స్ మాట్లాకుంటారు. సినిమాల పరంగా నేనేం ఎన్టీఆర్‌కు, కల్యాణ్ రామ్‌కు సలహాలు ఇవ్వను. వారి ప్రొఫెషన్‌లో వారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఒక స్థాయికి కూడా చేరుకున్నారు. సినిమాలు బావుంటే.. నాకు నచ్చితే తప్పకుండా ఫోన్ చేసి అభినందిస్తాను’ అని చెప్పుకొచ్చారు.
కాగా, నందమూరి కుటుంబం(Nandamuri Family)లో కోల్డ్ వార్ నడుస్తోందన్న వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR)ను, కల్యాణ్ రామ్(Kalyan Ram)ను బాలయ్య దూరం పెడుతూ వస్తున్నారనే టాక్ బయట అనేక సందర్భాల్లో వింటున్నాం. కానీ ఎక్కడా దీనిపై ఎవరూ స్పందించలేదు. మరోవైపు బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు టాలీవుడ్ అగ్రహీరోలు అందరూ వచ్చినా.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం ఇప్పటివరకూ రాలేదు. దీంతో ఆ వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని పురందీశ్వరి చెప్పడంతో ఆ వార్తల కొంత పుల్‌స్టాప్ పడిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.






