Cyclone Montha: పొంచి ఉన్న తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో భారీవర్షాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-10-31 13:37:31  IST  )

ఎడతెరపి లేని వర్షాలతో సతమతమతున్న అన్నదాతలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది.

Cyclone Montha: పొంచి ఉన్న తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో భారీవర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరపి లేని వర్షాలతో సతమతమతున్న అన్నదాతలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మార్ ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావం ఏపీ జిల్లాలపై అధికంగా ఉండవచ్చని అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా రూపాంతరం చెందనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.

వాయుగుండం రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడి.. సోమవారానికి నైరుతిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను మారవచ్చని అంచనా వేసింది. ఈ తుపాను ఈ నెల 28 లేదా 29 తేదీల్లో తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభాంతో శనివారం కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖన్ జైన్ సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ తుపానుకి భారత వాతావరణ శాఖ మోంతా అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, తిరువళ్లూరులో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. మరో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో చెన్నై సహా ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Next Story