ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. ప్రాణాలకే ప్రమాదం

by Gantepaka Srikanth |

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్(Montha Cyclone) తీరాన్ని తాకింది. కోనసీమలోని అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది.

ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. ప్రాణాలకే ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్(Montha Cyclone) తీరాన్ని తాకింది. కోనసీమలోని అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి 4 గంటల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు తుపాను ప్రత్యేక అధికారి అజయ్ జైన్(Ajay Jain) హెచ్చరిక జారీ చేశారు. తుపాన్ తీరం దాటే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉండనుందని తెలిపారు. కోనసీమ(Konaseema) జిల్లా వాసులు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిక జారీ చేశారు. కొబ్బరి చెట్లు, పామ్‌ ట్రీలు విరిగిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Next Story