- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
18 కి.మీ వేగంతో కదిలిన మొంథా తుపాను... ఏపీకి ఎంత దూరంలో ఉందంటే..?
మొంథా తుపాను ప్రభావం రాష్ట్రంపై ప్రారంభమైంది.....

X
దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను(Montha Cyclone) ప్రభావం రాష్ర్టంపై ప్రారంభమైంది. దీంతో కోస్తా జిల్లా(Kosta Distict)ల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. తుపాను దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రభావం చూపుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలో మీటర్ల వేగంతో మొంథా తుపాను కదిలింది. ప్రస్తుతానికి చెన్నైకి 520కి.మీ, కాకినాడకి 570 కి.మీ., విశాఖపట్నంకి 600 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్(Disaster Management Authority MD Prakhar Jain) తెలిపారు . తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండని, అప్రమత్తంగా ఉండండని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
Next Story






