కుప్పకూలిన సినిమా థియేటర్.. తప్పిన ప్రమాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-29 12:41:20  IST  )

బాపట్ల జిల్లాపై మొంథా తుపాను ప్రభావం భారీగా పడింది...

కుప్పకూలిన సినిమా థియేటర్.. తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా(Bapatla District)పై మొంథా తుపాను(Montha Cyclone) ప్రభావం భారీగా పడింది. తీరం వెంబడి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్లు కరెంట్ తీగలు తెగిపోయాయి. కరెంట్ స్తంభాలు, చెట్లు కుప్పకూలాయి. గాలివాన దెబ్బతో సూర్యలంక రోడ్డులో ఉన్న బెలూన్ థియేటర్(Balloon Theatre) నేల కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోడం ప్రమాదం తప్పింది. మరోవైపు సూర్యలంక బీచ్‌(Suryalanka Beach)లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాల ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీచ్ వద్దకు ఎవరిని అనుమతించడంలేదు. మత్య్సకారులను వేటకు వెళ్లనివ్వలేదు. అధికారులు ప్రకటించేందుకు ఎవరూ సముద్రంవైపు వెళ్లొద్దని అధికారులు ప్రకటించారు.

READ MORE ....

18 లక్షల మందిపై మొంథా ప్రభావం

Next Story