మొంథా సైక్లోన్ ఎఫెక్ట్.. 43 రైళ్ల రద్దు

by Muthe.Rajitha |   (  Updated:2025-10-27 11:06:54  IST  )

మొంథా తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

మొంథా సైక్లోన్ ఎఫెక్ట్.. 43 రైళ్ల రద్దు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు తుఫాను మచిలీపట్నం - కళింగపట్నం మధ్య తీరం దాటనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రతోపాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తుఫాను నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మీదుగా ప్రయాణించే 43 రైలు సర్వీసులను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

అక్టోబర్‌ 27, 28, 29 తేదీల్లో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అలాగే, రద్దుచేసిన రైళ్ల జాబితాను ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైలు స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Read More: తుపాను ఎఫెక్ట్.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

Next Story