Cyclone Montha | ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన

by Thanuru Gopichand |

మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట, ఆస్తి నష్టాలు జరిగాయి.

Cyclone Montha | ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట, ఆస్తి నష్టాలు జరిగాయి. ఇప్పటికే నష్టానికి సంబంధించిన నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. నష్టపరిహారం (Compensation) కోసం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ క్రమంలో మొంథా తుపాను ప్రభావిత జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాలని అంచనా వేయడానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం (Inter Ministerial Central Team) సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ (Prakhar Jain) వెల్లడించారు. వీరు రెండు బృందాలుగా ఏర్పడి సోమవారం టీం వన్ బాటప్ల జిల్లాలో, టీం టూ కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. మంగళవారం టీం వన్ ప్రకాశం జిల్లాలో, టీం టూ కోనసీమ జిల్లాల్లో పర్యటించి నష్టాల్ని స్వయంగా పరిశీలించడంతో పాటు తుపాను బాధితులతో నేరుగా మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.

కేంద్ర బృందంలో సభ్యులు

రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ డెవలప్మెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.పొన్నుస్వామి, న్యూఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ పెండిచర్ డిప్యూటీ డైరెక్టర్ మహేశ్ కుమార్, సెంట్ర వాటర్ కమిషన్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీనివాసు బైరి, రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శశాంక్ శేఖర్ రాయ్, గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ మనోజ్ కుమార్ మీనా, న్యూఢిల్లీ విద్యుత్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్తి సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ కు చెందిన సైంటిస్ట్-ఈ సాయి భగీరథ్ కేంద్ర బృందంలో సభ్యులుగా ఉన్నారు.

Next Story