విశాఖలో భారీ వర్షం.. బీభత్సం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-02 10:28:22  IST  )

ఉత్తరాంధ్రపై వాయుగుండం ఎఫెక్ట్ పడింది

విశాఖలో భారీ వర్షం.. బీభత్సం
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాంధ్ర(Uttarandhra)పై వాయుగుండం ఎఫెక్ట్ పడింది. పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు(Heavy Rains) పడుతున్నాయి. విశాఖలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. జీవీఎంసీ సమీపంలో భారీ వృక్షం కూలి పార్క్ చేసిన లారీ, కారుపై పడింది. అక్కయ్యపాలెం పరిధిలో రెండు చోట్ల ప్రమాదం జరిగింది. శ్రీనివాసరగర్ లో కారుపై రావి చెట్టు పడింది. అలాగే ఓ ఇంటి గోడ పడిపోయింది. కళింగనగర్ మెయిన్ రోడ్డులోనూ పార్క్ చేసిన కారుపై చెట్టు కూలింది. దీంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపైకి వర్షపు నీరు చేరడంతో కొన్ని ఏరియాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక శుక్రవారం తెల్లవారు జాము వరకూ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీవీఎంసీ అధికారుల అప్రమత్తమయ్యారు. రోడ్డుపై విరిగి పడిన చెట్లను తొలగిస్తున్నారు.

Next Story