ఏపీపై తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు

by Vemula.Srinu Prasad |

నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన్ని ఆనుకుని దిత్వా తుపాను కేంద్రీకతృమైంది..

ఏపీపై తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక(Srilanka) తీరాన్ని ఆనుకుని దిత్వా తుపాను(Ditva Cyclone) కేంద్రీకతృమైంది. ఇది సోమవారం తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ(Ap)లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని స్పష్టం చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. నెల్లూరు, కడప, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక బాపట్ల, పల్నాడు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటితో మొదలై మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉందని, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో మోస్తరుగా వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం వరకు సముద్రం పోటు మీద ఉంటుందని మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Next Story