- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరు, గూడూరులో భారీ వర్షం.. పరిస్థితి దారుణం
నెల్లూరు, గూడూరు ప్రజలను దిత్వా తుపాను వణికించింది. ..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు, గూడూరు ప్రజలను దిత్వా తుపాను(Ditva Cyclone) వణికించింది. దీని ఎఫెక్ట్‌తో భారీ వర్షం ఒక్కసారిగా విరుచుకుంది. దెబ్బతో జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. చెరువులు, వాగులు, వంకలు, రోడ్లు నీటిలో కనిపిస్తున్నాయి. ఇళ్లాలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనరాకపోకలకు సైతం ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోజు ఫ్లాష్ ఫ్లడ్స్(Flash floods) హెచ్చరికలతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బుధవారం కురిసిన భారీ వర్షంతో అల్లాడిపోయామని, ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలతో మరింత భయం పట్టుకుందని తెలిపారు. ఆకస్మికంగా వరదలు వస్తే పరిస్థితేందని ఆందోళన వ్యక్తం చేశారు. మరో వైపు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు భయపడొద్దని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాసాలకు తరలివెళ్లాలని సూచించారు.






