- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లికి వందనం పేరుతో ఫోన్లు వస్తున్నాయా? జాగ్రత్త
సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలను టార్గెట్

దిశ, వెబ్ డెస్క్: సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. అమాయక ప్రజలను టార్గెట్ గా చేసుకుని ఏదో ఒక రకంగా కేటుగాళ్లు వల విసురుతున్నారు. వారిని నమ్మారంటే అందినంత దోచేస్తున్నారు. కొందరు కేటుగాళ్లు ఏకంగా ప్రభుత్వ పథకాల పేరుతోనూ దోచేయడం మొదలు పెట్టారు. తాజాగా ప్రభుత్వ పథకం పేరుతో రూ.71వేలు అకౌంట్ నుండి కాజేసిన ఘటన ఏపీలోని కావాలిలో చోటు చేసుకుంది. ఆగంతకుడు మహిళకు ఫోన్ చేసి మీకు తల్లికి వందనం డబ్బులు వచ్చాయని వాట్సాప్ లో స్కానర్ పంపిస్తాం అది స్కాన్ చేస్తే సరిపోతుందని చెప్పాడు.
దీంతో మహిళ అతడు చెప్పినట్టుగా చేసింది. స్కాన్ చేసిన తరవాత రూ.15వేలు ఎంటర్ చేయమని చెప్పాడు. అలానే ఎంటర్ చేసింది కానీ పాస్ వర్డ్ ఎంటర్ చేయకపోవడంతో ఏమీ కాదని ధీమాతో ఉంది. అలా ఏకంగా ఐదు సార్లు స్కాన్ చేసింది. ఫోన్ కట్ చేసిన తరవాత క్రెడిట్ అవుతాయి అనుకుంటే రూ.71వేలు డెబిట్ అయ్యాయి. దీంతో మోసపోయామని గ్రహించి సైబర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.






