- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెయిటింగ్‌లో ఉన్న ఇద్దరు IPSలకు పోస్టింగ్.. సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ
by Kema Shiva Kumar |
పోలీసు శాఖలో కొన్నాళ్ల నుంచి రెండు ముఖ్యమైన పోస్టుల భర్తీలో సందిగ్ధత నెలకొంది.

X
దిశ, వెబ్‌డెస్క్: పోలీసు శాఖలో కొన్నాళ్ల నుంచి రెండు ముఖ్యమైన పోస్టుల భర్తీలో సందిగ్ధత నెలకొంది. అయితే, ఇదే విషయాన్ని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (Harish Kumar Gupta), సీఎం చంద్రబాబు (CM Chandrababu) దృష్టి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు వెయింటింగ్‌లో ఉన్న ఇద్దరు ఐపీఎస్‌కు పోస్టింగ్స్ ఇస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ కార్యాలయంలో లా అండ్ ఆర్డర్ ఏఐజీగా ఐపీఎస్ కృష్ణకాంత్ (Krishnakanth)ను నియమించారు. అదేవిధంగా అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ బాధ్యతలను ఐపీఎస్ సురేశ్‌బాబు (Suresh Babu)కు అప్పగించారు. ఈ మేరకు ఇవాళ ఆ ఇద్దరు నియామకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారికి ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






