Tirumala:భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?

by Jakkula.Mamatha |

తిరుమల(Tirumala)లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తుంటారు.

Tirumala:భక్తుల రద్దీ సాధారణం.. శ్రీవారి దర్శనానికి సమయం ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala)లో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు(Devotees) తరలి వస్తుంటారు. ఈ క్రమంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సార్లు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. కొన్ని సార్లు భక్తుల రద్దీ సాధారణంగా ఉంటుంది.

ఈ క్రమంలో నేడు(శనివారం) తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ తరుణంలో టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనానికై వేచి ఉన్నారు. నిన్న(శుక్రవారం) 65,327 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22.804మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామి వారికి రూ.3.52 కోట్ల ఆదాయం లభించింది.

Next Story