Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దేవదేవుడి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

by Kema Shiva Kumar |   (  Updated:2024-04-05 03:45:00  IST  )

కలియుగ దైవం తిరుమల భక్తులతో కిటలాడుతోంది.

Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దేవదేవుడి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం తిరుమల భక్తులతో కిటలాడుతోంది. వారాంతం కావడంతో శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు శ్రీవారి దర్శనానికి ఖచ్చితంగా 16 గంటల సమమం పడుతోంది. అదేవిధంగా మరో వారం రోజులు గడిస్తే.. విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరిత తగ్గే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పద్దెనిమిది కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గురువారం స్వామి వారిని 62,459 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 26,816 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Next Story