- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: యువ క్రికెటర్ నితీశ్‌కు సత్కారం
మంత్రి నారా లోకేశ్‌ను క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి కలిశారు..

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)ను క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి(Cricketer Nitish Kumar Reddy) కలిశారు. దీంతో ఆయనను మంగళగిరి(Mangalagiri) చేనేత శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. రాష్ట్రంలో యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రి ప్రశంసించారు. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు లోకేశ్ అభినందించారు.
అటు ఏపీ సీఎం చంద్రబాబు(Cm Chandrababu Naidu)ను సైతం నితీశ్ కుమార్ రెడ్డి కలిశారు. విజయవాడ ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని(Vijayawada MP and ACA president Keshineni Chinni) ఆధర్వంలో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా టెస్టు(Australia Test)లో ప్రతిభ కనబరిచినందుకు అభినందించారు. తాము ప్రకటించిన రూ. 25 లక్షల చెక్‌ను నితీశ్‌కు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ ఐపీఎల్‌కు రాష్ట్రం నుంచి గతేడాది ఐదుగురు ఎంపిక అయ్యారని, వచ్చే సంవత్సరం 15 మంది ఎంపిక అయ్యేలా కృషి చేస్తామని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని తెలిపారు.






