CPI: కేంద్రం నిర్ణయం స్వాగతిస్తున్నాం.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

by Ramesh Naini |

కుల గణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పష్టం చేశారు.

CPI: కేంద్రం నిర్ణయం స్వాగతిస్తున్నాం.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: (caste census) కుల గణనపై కేంద్ర ప్రభుత్వం (central government) తీసుకున్న నిర్ణయాన్ని (CPI) సీపీఐ స్వాగతిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ (CPI National Secretary K. Narayana) స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రకరకాల పద్ధతిలో పెండింగ్ లో ఉన్న కులగణన అంశాన్ని ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఈ విషయంగా ప్రజా సంఘాలు, బీసీ నేతలు, రాజకీయ పరమైన ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కులగణనకు అంగీకరించడం శుభపరిణామం అని అభిప్రాయపడ్డారు.

ఈ విషయంపై సోషల్ మీడియా కేంద్రంగా పలు రకాల అపోహలు, అనుమానాలు, విమర్శలు గుప్పిస్తున్నారని, అయితే విషయంగా కొంత వేచి చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానైనా, లోపాలున్నా ఆ విషయంగా పోరాటాలు చేద్దామని అప్పటి వరకు అసంబద్ధమైన సందేహాలను లేవనెత్తడం సరికాదన్నారు. కులగణన అంశాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి, సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story