- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
D. Raja: బిహార్ ఫలితాలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా సంచలన ఆరోపణలు
బిహార్ ఎన్నికల ఫలితాలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బిహార్ ఎన్నికల ఫలితాలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా స్పందించారు. విజయవాడలో సీపీఐ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మీట్ ది ప్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కార్పొరేట్‌ల నుంచి డబ్బులు తీసుకున్న పార్టీ బీజేపీ అని రాజా విమర్శలు గుప్పించారు. ఎన్నికల అధికారి ఈసీని ప్రధాని నియమించవచ్చని బీజేపీ నిర్ణయం చేసిందన్నారు. బిహార్ ఫలితాలపై అనేక అనుమానాలు ఉన్నాయని డి. రాజా ఆరోపించారు. బర్త్ సర్టిఫికెట్ లాంటివి గత రోజుల్లో లేవు, వాటి ద్వారా ఓట్లు లక్షల్లో తగ్గించారని, ఎన్నికల కమిషన్‌పై నమ్మకం పోయిందని విమర్శించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాల్లో ఎన్డీఏ రావడంపై ఇప్పటికే ఆందోళనలో ఉన్నారని అన్నారు. SIR ప్రధాన సమస్యగా మారిందని, బిహార్ ఫలితాలపై ఇండియా కూటమి తమ లోపాలను బేరీజు వేసుకోవాలని సూచించారు. తమిళనాడు, బెంగాల్, కేరళలలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. బెంగాల్ తమ తదుపరి టార్గెట్ అంటూ ప్రధాని మోడీ చెప్పినట్లు తెలిపారు, లెఫ్ట్ పార్టీలు అన్నీ ఒక మాట మీద పని చేయాలని రిక్వెస్ట్ చేశారు. లెఫ్ట్ పార్టీలు కలిసి కట్టుగా పని చేస్తేనే బీజేపీపై పోటీ చేయగలమని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాజ్యాంగానికి ఆర్ఎస్ఎస్తో ప్రమాదం పొంచి ఉందన్నారు. అలాగే, ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్ సపోర్టుతోనే కేంద్రంలో మోడీ అధికారంలో ఉన్నారని డి. రాజా కీలక వ్యాఖ్యలు చేశారు.






