- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐబొమ్మ రవి, హిడ్మాలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవిపై పీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవిపై పీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఐబొమ్మలో నేను సినిమాలు ఫ్రీగా చూశానని హాట్ కామెంట్స్ చేశారు. ఆరేడు వందలు పెట్టి సినిమాలు ఎలా చూసేది అని చూశానని చెప్పుకొచ్చారు. ఒకరు మంచి చేస్తే మరొకరు చెడు చేస్తారు అని అన్నారు. అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలే అని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవస్థలో లోపాలు సరి చేయకుండా ఉంటే ఇలాంటి రవిలే పుట్టుకు వస్తారని, ఒక హిడ్మాను చంపితే వెయ్యి మంది హిడ్మాలు పుడతారని సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక బొమ్మ రవిని చంపితేనో, జైల్లో వేస్తేనో మరో 100 మంది వస్తారని తెలిపారు. ఐ బొమ్మ రవి ని ఉరి వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని, సినిమా మాఫియాను ఉరి తీస్తే సమాజానికి ఉపయోగం ఉంటుందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి టికెట్ ధరల కోసం ఆడుక్కుంటారని అన్నారు. సామాన్య ప్రజలను దోచుకోవడానికి ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందా అని నిలదీశారు. కోట్లాది రూపాయలు దోచుకుంటున్న వారిని ఐ-బొమ్మ రవి దెబ్బ కొట్టారని అన్నారు.






