CPI Narayana: చంద్రబాబుకు మళ్లీ ‘విద్యుత్’ షాక్ ఖాయం

by Gantepaka Srikanth |

స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన చేశారు.

CPI Narayana: చంద్రబాబుకు మళ్లీ ‘విద్యుత్’ షాక్ ఖాయం
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI Narayana) మాట్లాడుతూ.. స్మార్ట్ మీటర్లతో కరెంట్ బిల్లు భారీగా వస్తోందని అన్నారు. విద్యుత్ ఛార్జీల పేరిట దోపిడీని ఆపాలని డిమాండ్ చేశారు. గతంలో స్మార్ట్ మీటర్లను స్వయంగా టీడీపీనే వ్యతిరేకిందని గుర్తుచేశారు. ఆరోజున వ్యతిరేకించిన మీరే.. మళ్లీ స్మార్ట్ మీటర్లు తీసుకురావడం కరెక్ట్ కాదని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ సంస్కరణలు తీసుకొచ్చిన చంద్రబాబు(CM Chandrababu)కు గట్టి షాక్‌ తగిలింది.. ఆ తర్వాత ఆయన ఓటమి పాలయ్యారు.. అయితే, మరోసారి చంద్రబాబుకు కరెంట్‌ షాక్‌ కొట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైసీపీ పోయి.. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ వచ్చినా మార్పు ఏం కనిపించడం లేదని.. పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంభిస్తుందని విమర్శించారు.

Next Story