మిత్రుడి ఇంట్లో పరిస్థితి విచారకరం.. సీపీఐ నారాయణ తీవ్ర ఆవేదన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-22 11:51:08  IST  )

మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, అలాంటి నేత కుటుంబంలో నేడు తలెత్తిన సంక్షోభం తనను ఎంతగానో కలచివేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ..

మిత్రుడి ఇంట్లో పరిస్థితి విచారకరం.. సీపీఐ నారాయణ తీవ్ర ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhara Reddy) తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, అలాంటి నేత కుటుంబంలో నేడు తలెత్తిన సంక్షోభం తనను ఎంతగానో కలచివేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(CPI National Secretary Narayana) అన్నారు. వైఎస్ కుటుంబం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఐక్యతకు మారుపేరుగా ఉన్న ఆ కుటుంబం నేడు బహిరంగంగా విమర్శలుచేసుకోవడం విచారకరమని నారాయణ వ్యాఖ్యానించారు. కుటుంబం విభేదాలు సహజమని, వాటిని నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలని సూచించారు. ఆస్తి తగాదాలు ఆ కుటుంబ ప్రతిష్టకే భంగకరమని నారాయణ అభిప్రాయపడ్డారు. కుటుంబ వ్యవహారాలను బహిరంగపరచడం వైఎస్సార్‌ను అభిమానించే లక్షలాది మందికి మనస్తాపం కలిగిస్తుందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

హాట్ టాపిక్‌గా వైఎస్ ఆస్తుల వివాదం

అయితే నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల(Ys Sharmila), ఏపీ మాజీ సీఎం జగన్(Former Cm Jagan) మధ్య నడుస్తున్న ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల నేపథ్యంలో నారాయణ స్పందించిన తీరు ప్రాధాన్యతను సూచిస్తోంది. రాజకీయ విబేధాలు పక్కన పెట్టి, ఒక మిత్రుడిగా నారాయణ చేసిన సూచనలు వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా సయోధ్యకు దారితీస్తాయేమో చూడాలి.

Next Story