రాష్ట్రాల మధ్య చిచ్చు.. పవన్ కల్యాణ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలి: సీపీఐ నారాయణ డిమాండ్

by Ramesh Naini |

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆ పదవికి అనర్హుడని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ అన్నారు.

రాష్ట్రాల మధ్య చిచ్చు.. పవన్ కల్యాణ్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించాలి: సీపీఐ నారాయణ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆ పదవికి అనర్హుడని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కే నారాయణ అన్నారు. ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేవిలా ఉన్నాయని, ఐక్యతకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించారు. తెలుగు రాష్టాలు సాంకేతికంగా విడిపోయినా అందరూ కలిసే ఉన్నారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాంతంలోని భీమవరానికి చెందిన వారికి ఇచ్చి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

పవన్ కల్యాణ్ తొలి రోజుల్లో చేగువేరా తనకు ఆదర్శం అన్నారని, ఇప్పుడు సావర్కర్‌ను భుజాన వేసుకుని తిరుగుతూ సనాతన ధర్మం అంటున్నారని విమర్శించారు. సనాతన ధర్మం కోసం తిరగాలి అనుకుంటే తమకేమి అభ్యంతరం లేదని, రాజకీయాల్లో ఉండకుండా ఆ పని చేసుకోవచ్చని సెటైర్లు వేశారు. సనాతన ధర్మం చెప్పే దిష్టి తగిలింది లాంటి మాటలు మాట్లాడే సనాతన వాదికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయాలకు తగడని, తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.

Next Story