రామ్మోహన్ నాయుడిని మంత్రి వర్గం నుంచి తప్పించే కుట్ర! సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఇండిగో సంక్షోభంపై సీపీఐ నేత నారాయణ మరోసారి స్పందించారు. గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు.

రామ్మోహన్ నాయుడిని మంత్రి వర్గం నుంచి తప్పించే కుట్ర! సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండిగో సంక్షోభంపై సీపీఐ నేత నారాయణ మరోసారి స్పందించారు. గురువారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్లుగా ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. పౌర విమానయాన రంగంలో ఇండిగో వాటా 64 శాతంగా ఉన్నదని గుర్తు చేశారు. పబ్లిక్‌ సెక్టార్‌లో విమానాలు లేకపోవడం వల్లే ఇలాంటి సంక్షోభాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అయితే, ఇండిగో సంస్థను అదానీ లాంటి వారికివ్వాలని, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని మంత్రి వర్గం నుంచి తప్పించాలని కుట్ర జరుగుతుందని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా సంస్థను నిర్వీర్యం చేసి శవాలపై పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తప్పు చేసిన ఇండిగోతో బుజ్జగింపు ఏమిటి? అని ప్రశ్నించారు. బరితెగించి ఎన్నో తప్పులు చేసిన ఇండిగో యాజమాన్యాన్ని తీసివేయడం కాదని, వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. సంస్థను జాతీయం చేయాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు.

Next Story