రాష్ట్రంలో మితిమీరుతున్న ఆగడాలు.. సీపీఐ సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో మితిమీరుతున్న ఆగడాలపై సీపీఐ సంచలన డిమాండ్ చేసింది...

రాష్ట్రంలో మితిమీరుతున్న ఆగడాలు.. సీపీఐ సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆగడాలు మితిమీరుతున్నాయి. వడ్డీలు, చిట్టీలు, లోన్లు, అప్పుల పేరుతో జనాన్ని కొందరు పీల్చుకుతింటున్నారు. అమాయక బాధితులపై బరితెగిస్తు్న్నారు. వడ్డీలు కట్టలేకపోయినా.. ఆలస్యమైనా దాడులకు తెగబడుతున్నారు. భర్త అప్పు చేశారని భార్యను చెట్టుకు కట్టేశారు. ఈ ఘటన మొత్తం రాష్ట్రాన్ని కలిచివేసింది. దీంతో నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.

అయితే రాష్ట్ర సీపీఐ(CPI) పార్టీ మాత్రం సంచలన డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)కు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(Ramakrishna) లేఖ రాశారు. తమిళనాడు తరహాలో బలవంతపు అప్పు వసూళ్లపై కఠిన శిక్షపడేలా శాసనసభలో బిల్లు తీసుకురావాలని కోరారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, ఆన్‌లైన్ మనీ యాప్స్, వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయని మండిపడ్డారు. బలవంతపు రుణ వసూళ్లపై తమిళనాడు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదం పొందిందని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Next Story