- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరూ దోచుకుంటున్నారు: సీపీఐ నేత నారాయణ సంచలన ఆరోపణలు
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని సీపీఐ నేత నారాయణ(Cpi Leader Narayana) అన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ నాడు వైసీపీ(Ycp) మాదిరిగానే నేడు కూటమి ప్రభుత్వం సైతం రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణంలో అడ్డదారిలో అగ్రిమెంట్ చేయించుకుని అప్పటి ముఖ్యమంత్రి జగన్(Jagan) దోచుకుంటే.. పీపీపీ విధానాన్ని ప్రస్తుత సీఎం చంద్రబాబు(Chandrababu) కూడా అదే పని చేస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతోందని, కానీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆరోపించారు.
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, హత్యలు, దోపిడీలు కొనసాగుతున్నాయని నారాయణ తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సరికాదని సీపీఐ నేత నారాయణ సూచించారు. ఆరోగ్య వ్యవస్థను ప్రైవేటీకరణ చేయకూడదని ఆయన చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదల ప్రజల గొంతుకోయడమేనని మండిపడ్డారు. పీపీపీ విధానంలో విలువైన భూములు ఇస్తారని, మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుందని, ఇందుకు అయ్యే ఖర్చు మొత్తం ఐదేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కేంద్రం ఒప్పుకోక ఏం చేస్తుందని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించారు.






