ఐసిస్ ఉగ్రకుట్ర కేసు: ఆరిఫ్‌కు రిమాండ్

by Vemula.Srinu Prasad |

ఐసిస్ ఉగ్ర కుట్ర కేసులో నిందితుడు ఆరిఫ్‌కు కోర్టు రిమాండ్ విధించింది...

ఐసిస్ ఉగ్రకుట్ర కేసు: ఆరిఫ్‌కు రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: కొద్దిరోజుల క్రితం విజయనగరం ఉగ్ర కుట్ర(Vizianagaram terror conspiracy) భగ్నం అయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు. తెలుగు రాష్ట్రాలే టార్గెట్‌గా సిరాజ్, ఆరిఫ్ పేలుళ్లకు కుట్ర పన్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో విజయనగరం పోలీసులు(Vizianagaram Police) ఈ పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు. ఇద్దరు నిందితులు సిరాజ్, ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకుని కస్టడీలో విచారించారు. అనంతరం కేసును ఎన్ఐఏ(NIA)కు అప్పగించారు. దీంతో కేసును ఎన్ఐఏ విచారించింది. మరో నిందితుడు సిరాజ్‌తో కలిసి ఆరిఫ్ ఆయుధాలు సరఫరా చేసినట్లు NIA గుర్తించింది.

తాజాగా ఆరిఫ్‌ను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు నిందితుడు ఆరిఫ్‌కు న్యాయమూర్తి 14 రోజుల పాటు నిందితుడికి రిమాండ్ విధించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలిబ్ అంతకుముందు దేశం విడిచి పారిపోయేందుకు ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టుకి వెళ్లారు. దీంతో ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.

Next Story