ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకు షాకిచ్చిన కోర్టు

by Naga Rani Yarlagadda |

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకు షాకిచ్చిన కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి (ఏ6), బాలాజీ గోవిందప్ప(ఏ33)ల బెయిల్ పిటిషన్లను పరిశీలించిన కోర్టు డిస్మిస్ చేసినట్లు తెలిపింది.

జులై 10న సీఐడీ సిట్ ఈ కేసులో ఏ5గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గతంలోనూ సిట్ విజయసాయిరెడ్డిని ఈ కేసులో ప్రశ్నించింది. నాడు అన్నీ రాజ్ కసిరెడ్డినే చేశారని చెప్పారాయన. ఆ తర్వాత సీఐడీ అనేక మందిని అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ లో కొల్లగొట్టిన సొమ్ముతో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డి ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ అనే నిర్మాణసంస్థను నెలకొల్పి సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత కూడా యువ డైరెక్టర్లు, రచయితలకూ అవకాశాల పేరుతో భారీగా అడ్వాన్సులిచ్చారు. స్కామ్ లో నగదు రూపంలో వచ్చిన డబ్బుతో సినిమాలు తీయాలనుకున్న సమయంలో ఎన్నికలు రావడం, జగన్ అధికారం కోల్పోవడంతో చేసేది లేక కొత్త ప్రాజెక్టులను ఆపివేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Next Story