- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vijayawada: నడి రోడ్డులో బైక్‌పై జంట రొమాన్స్! విజయవాడ హైవేపై ఘటన.. వీడియో వైరల్
ఈ మధ్య కొంత మంత్రి ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లోనే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (viral video) ఈ మధ్య కొంత మంత్రి ప్రేమ జంటలు రెచ్చిపోతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లోనే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ జనాలు ఉన్నారనే సోయి లేకుండా రోడ్లపైనే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా కొంత మంది ప్రేమ జంటలు (Couple romance on bike) బైక్‌లపై విచ్చల విడిగా రెచ్చిపోతున్నారు. అదేదో ఫ్యాషన్ అన్నట్లుగా ప్రియురాలిని బైక్ ముందు ట్యాంక్‌పై కూర్చోబెట్టుకోని స్టంట్స్ వేస్తున్నారు. స్టంట్స్ చేయడమే కాకుండా రోడ్డుపై సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది.
(Ramalingeshwara Nagar flyover on Vijayawada highway) విజయవాడ హైవేపై రామలింగేశ్వర నగర్ ఫ్లై ఓవర్ వద్ద ఓ జంట బైక్ మీద వెళ్తూ.. అసభ్యంగా ప్రవర్తించడం చూసి వాహనదారులు షాక్ అయ్యారు. వీడియో లో ఉన్న ప్రకారం.. ప్రియుడు బైక్ నడుపుతుంటే ప్రియురాలు అతడి ముందు పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చుంది. పక్కనే ద్విచక్ర వాహనాలపై ఎంతో మంది వెళ్తున్నా వీళ్లు రొమాన్స్‌ను మాత్రం అపడం లేదు. చుట్టుపక్కల వాళ్ళు తమనే గమనిస్తున్నారని తెలియని స్థితిలో ప్రేమ మైకంలో వాళ్లు మునిగిపోయారు. మరోవైపు స్పీడ్‌గా పోతున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన మరో బైకర్ వారి తతంగమంతా వీడియో తీశాడు. మద్యం మత్తులో బైక్‌పై వెళ్తూ జంట రొమాన్స్ చేస్తోందని వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి గలీజ్ పనులు రోడ్లపై కాకుండా ఇంట్లో చేసుకోవాలని నెటిజన్లు మండిపడ్డారు. ఇలాంటి వారి వల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రోడ్లపై అసభ్యకరంగా ప్రవర్తించే ప్రేమ జంటలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని, ఈ ప్రేమ జంటను పోలీసులు అరెస్ట్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వాలని నెటిజన్లు ఏపీ పోలీసులకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేశారు.






