విషాదం.. యాసిడ్ తాగి దంపతుల మృతి

by Naga Rani Yarlagadda |

యాసిడ్ తాగి దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. వారి కూతురి పరిస్థితి విషమంగా మారింది.

విషాదం.. యాసిడ్ తాగి దంపతుల మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: యాసిడ్ తాగి దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. వారి కూతురి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామంలో జరిగింది. అప్పారావు, లలిత దంపతులకు దేవి అనే కుమార్తె ఉంది. చాలా కాలంగా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనికి తోడు అప్పారావును అంధత్వం వేధిస్తోంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. దంపతులు మృతి చెందగా.. వారి కూతురు దేవి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story