- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టండి : మంత్రి లోకేశ్
కూటమి నేతల మధ్య సఖ్యత ఉండాలని సూచించిన మంత్రి.

దిశ, వెబ్ డెస్క్ : గత వైసీపీ ప్రభుత్వం చేయకూడని పాపాలు చేసి ఇప్పుడు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో తిప్పి కొట్టాలని టీడీపీ శ్రేణులకు మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. పార్టీ నాయకుల కోసం మంగళగిరిలోని ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న 11వ శిక్షణ తరగతుల్లో మంత్రి మాట్లాడారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. అంతేకాకుండా తప్పుడు ప్రచారాలను చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని స్పష్టం చేశారు.
ఆ బాధ్యత కార్యకర్తలపై ఉంది
2014–19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసినా వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లడంలో వెనుకబడ్డామని లోకేశ్ గుర్తు చేశారు. అదే అప్పటి ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాన్ని ప్రజలకు నేరుగా వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని తెలిపారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. 2019లో అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టామని, కానీ ప్రతిపక్షం దుష్ప్రచార రాజకీయాలతో అధికారంలోకి వచ్చిందని లోకేష్ అన్నారు. ఇకపై అభివృద్ధితో పాటు, తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేసే శక్తులను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు.
నాయకుల మధ్య సఖ్యత ముఖ్యం
కూటమి నాయకుల మధ్య సఖ్యత అత్యంత ముఖ్యమని మంత్రి లోకేశ్ తెలిపారు. కూటమిని చీల్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా, కూటమిని విడదీయడం ఎవరి తరం కాదని ఆయన స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలో కూటమి నేతలందరినీ కలుపుకుని కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ కోసం ప్రతి కార్యకర్త చేస్తున్న సేవలు, కష్టాలను మై టీడీపీ యాప్ ద్వారా పార్టీకి తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో మై టీడీపీ యాప్‌ను తప్పనిసరిగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరారు. ఈ శిక్షణ తరగతులు పార్టీని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా మారతాయని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.






