AP Legislative Council: వైసీపీకి మండలి డిప్యూటీ చైర్మన్​ జకియా ఖానం రాజీనామా

by Thanuru Gopichand |

వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్​బై చెప్పారు. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్​ జకియా ఖానం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ మోషేన్​రాజుకు లేఖ రాశారు.

AP Legislative Council: వైసీపీకి మండలి డిప్యూటీ చైర్మన్​ జకియా ఖానం రాజీనామా
X

ఆ పార్టీకి భారీ షాక్​.. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్సీలు గుడ్ బై

పెండింగ్​లోనే వారి రాజీనామాలు

మండలిలో వైసిపీకి తగ్గుతున్న పట్టు

ఆ పార్టీ వరుసగా వీడిపోతున్న కీలక నేతలు

దిశ, డైనమిక్​ బ్యూరో : వైసీపీకి మరో ఎమ్మెల్సీ (YCP MLC) గుడ్​బై చెప్పారు. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ చైర్మన్​ జకియా ఖానం (Jakiya Kanam) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ మోషేన్​రాజుకు లేఖ రాశారు. జకియా ఖానంను 2020లో ఎమ్మెల్సీగా గవర్నర్​నామినేట్​చేశారు. ప్రస్తుతం ఆమె మండలి డిప్యూటీ చైర్బన్​(Deputy Chairmain) గా కొనసాగుతున్నారు. జకియా ఖానం స్వస్థలం అన్నమయ్య జిల్లా రాయచోటి. రెండేళ్ల నుంచి వైసీపీలో ఆమె అసం తృప్తిగా ఉన్నారు. జకియా ఖానంతో కలిపి ఇప్పటి వరకు వైసీపీకి ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పటికే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్​చక్రవర్తి, మర్రి రాజశేఖర్​ తమ రాజీనామాలు సమ ర్పించారు. తాజాగా జకియా ఖానం రాజీనామా లేఖను తన వ్యక్తిగత సిబ్బందితో శాసనమండలి (Andhra Pradesh Legislative Council) ఛైర్మన్‌కు పంపించారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తే డిప్యూటీ చైర్మన్ పదవి కూడా పోతుంది.

గతంలో జకియా ఖానం మంత్రి నారా లోకేశ్​ను కలిశారు. అప్పట్లోనే ఆమె వైసీపీని (YCP) వీడిపోతారనే ప్రచారం జరిగింది. దీంతో పాటు ఆమె ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఓ భక్తుడికి సిఫారసు లేఖను అధిక ధరకు ఆమె అమ్మి నట్లు తిరుమలలో పోలీసు కేసు నమోదైంది. ఈ అంశం ఆమెకు తలనొప్పిగా కూడా మారింది. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాలను (Resignation) చైర్మన్​ఇంకా అంగీకరించలేదు. తమ రాజీనామాలు అనుమతించాలని పలుమార్లు వారు కోరారు. ఆ రాజీనామాలను అనుమతిస్తే తెలుగుదేశానికి (TDP) మండలిలో బలం పెరుగుతుంది. వైసీపీకి తగ్గుతుంది. దీంతో వాటిని పెండింగ్​లో ఉంచారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మరో ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ఓటమి చవిచూసి దాదాపు 11 నెలలు గడుస్తోంది. అప్పటి నుంచి వరసుగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక్కొరొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. సీనియర్​నేతలు కూడా పార్టీని వీడడం క్యాడర్​ను కలవర పరుస్తోంది.

Next Story